వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్నా ఆస్పత్రిలో భారత ఖైదీ సరబ్‌జిత్ సింగ్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sarabjit Singh
లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్ జిన్నా ఆస్పత్రిలో భారత ఖైదీ సరబ్‌జిత్ సింగ్ మరణించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత అతను మరణించాడు. శుక్రవారంనాడు తోటి ఖైదీల దాడిలో గాయపడిన సరబ్‌జిత్ సింగ్ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గల జిన్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

విధుల్లో ఉన్న వైద్యుడి నుంచి తనకు గురువారం ఉదయం 1 గంటకు (భారత కాలమానం ప్రకారం ఒంటి గంటన్నరకు) ఫోన్ వచ్చిందని, సరబ్‌జిత్ ఇక లేడని చెప్పాడి సరబ్‌జిత్ చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్య బోర్డు అధిపతి మహమూద్ షౌకత్ చెప్పారు. గుండె ఆగిపోయవడంతో సరబ్‌జిత్ మరణించినట్లు మరో వైద్యుడు చెప్పాడు.

సరబ్‌జిత్ మరణించినట్లు జిన్నా ఆస్పత్రి అధికారులు తమకు సమాచారం అందించారని ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ అధికార వర్గాలు చెప్పాయి. సరబ్‌జిత్ మృతదేహాన్ని భారత అధికారులకు లేదా అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా, లేదా అనేది తనకు తెలియదని షౌకత్ చెప్పారు. సరబ్‌జిత్ భారతదేశంలోని పంజాబ్‌కు చెందినవాడు. సరబ్‌జిత్ మృతదేహానికి శవపరీక్ష చేసే విషయంపై కూడా చెప్పలేనని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు.

తోటి ఖైదీలు చేసిన దాడిలో సరబ్‌జిత్ పుర్రె పగిలింది. దాంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. కోట్ లఖ్‌పత్ జైలులో ఆరుగురు ఖైదీలు అతనిపై దాడి చేశారు. పంజాబ్ ప్రొవిన్స్ బాంబు పేలుళ్ల కేసులో సరబ్‌జిత్‌కు శిక్ష పడింది. 22 ఏళ్లుగా సరబ్‌జిత్ పాకిస్తాన్ జైలులో ఉన్నాడు. ఐదు మెర్సీ పిటిషన్లను పాకిస్తాన్ తిరస్కరించింది. సరబ్‌జిత్‌పై దాడికి సంబంధించి అమీర్ అఫ్తాబ్, ముదస్సర్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

English summary
Indian death row prisoner Sarabjit Singh died of cardiac arrest in a Lahore hospital late on Thursday after being comatose for nearly a week following a brutal assault by other inmates of a high-security jail, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X