• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ నెల 6న జగన్ పార్టీలో చేరుతున్నా: ఎమ్మెల్యే కూన

By Srinivas
|
Kuna Srisailam Goud
హైదరాబాద్: తాను ఈ నెల 6వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నానని కుత్బుల్లాపూర్ కాంగ్రెసు పార్టీ అనుబంధ శాసన సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం అన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో తాను జగన్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు.

కుత్బుల్లాపూర్ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకే తాను వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పారు. మళ్లీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రావాలంటే అది కేవలం జగన్ ఒక్కడి వల్లనే సాధ్యమని ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావు కూడా శనివారం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు. జగన్‌తో భేటీ అనంతరం ఆయన చెప్పే సమాధానాలకు తాను సంతృప్తి చెందితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానన్నారు. దాడి కూడా ఈ నెల 6న జగన్ పార్టీలో చేరనున్నారు.

ఫుడ్ కోర్టును ప్రారంభించన వైయస్ వివేకా

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానికి చెందిన ఫుడ్ కోర్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌వి ఫుడ్ కోర్టును వివేకా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో వివేకాతో పాటు సనత్ నగర్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLA Kuna Srisailam Goud said that he will join in YSR Congress party on 6th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more