వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాంఖడేలోకి వెళ్తే షూట్ చేస్తారా: షారూఖ్ ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shah Rukh Khan
కోల్‌కతా: నిరుడు ఐపియల్ మ్యాచ్ సందర్భంగా తాను ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెక్యూరిటీ గార్డుతో గొడవ పడలేదని బాలీవుడ్ బాద్షా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ స్పష్టం చేశారు. సెక్యూరిటీ గార్డుతో గొడవ పడ్డారనే ఆరోపణపై షారూక్ ఖాన్ వాంఖడేలోకి అడుగు పెట్టకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.

తాను గొడవ పడలేదని, గొడవ పడాలనే ఆలోచన కూడా రాలేదని, చాలా ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. వాంఖడే స్టేడియంలో మే 7వ తేదీన జరిగే మ్యాచు విషయంపై ప్రస్తావించగా, రాజకీయంగా తప్పుగా మాట్లాడదలుచుకోలేదు గానీ వాంఖడేలోకి అడుగు పెడితే తనను కాల్చేస్తారా అని ఆయన అడిగారు.

అధికారులు గుర్తించకుండా తాను ముసుగు ధరిస్తానని ఆయన హాస్యమాడారు. మీసాలు పెట్టుకుంటానని, మారు వేషం లాంటిది వేస్తానని, అయితే తాను ఏ విధమైన అవకాశం తీసుకోదలుచుకేలదని, తాను మైదానం వెలుపల ఉండి, తన బాయ్స్‌ని ఉత్సాహపరుస్తానని షారూక్ ఖాన్ అన్నారు.

తన జట్టును వాంఖడేలోకి అడుగు పెట్టినిస్తే ఏ విధమైన ఇబ్బంది లేదని, తాము మ్యాచును గెలుస్తామని, మ్యాచు గెలవడానికి తాను అక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టీమ్ హోటల్‌లో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు.

నిజానికి, ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి కోల్‌కతా నైట్ రెడర్స్ డ్రెసింగ్ రూంలోకి షారూక్ ప్రవేశించారు. అలా ప్రవేశించడం తన తప్పిదమేనని ఆయన అన్నారు. కొన్ని సార్లు తాను నిబంధనలను మరిచిపోతానని ఆయన అన్నారు. మళ్లీ ఈ తప్పిదం చేయనని అన్నారు.

English summary
Kolkata Knight Riders' owner Shah Rukh Khan has admitted that he should not have got into a fight with the Wankhede stadium security guard during last season's IPL that led to MCA imposing a five-year ban on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X