హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో రామ్ చరణ్ హల్‌చల్: ఇద్దరిపై దాడి చేసిన గార్డ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Charan
హైదరాబాద్: హీరో రామ్ చరణ్ తేజ, ఆయన భద్రతా సిబ్బంది రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో వీరంగం సృష్టించారు! బంజారాహిల్స్‌లో రామ్ చరణ్ తేజ కారులో వెళ్తుండగా.. అడ్డు వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఆయన అంగరక్షకులు దాడి చేసినట్లుగా సమాచారం.

తన కారును ఢీకొట్టాడనే కారణంతో రామ్ చరణ్ ఆ ఇద్దరిపై చేయి చేసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్‌తో పాటు వారిపై అంగరక్షకులు చేయి చేసుకున్నారని, అప్పుడు రామ్ చరణ్ వారిని అడ్డుకోలేదని చెబుతున్నారు. జివికె మాల్ సమీపంలోని తాజ్ డెక్కన్ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది.

రామ్ చరణ్ తేజకు బాధితులు సైడ్ ఇవ్వక పోవడం వల్లనే వారి కారును ఓవర్ టేక్ చేసిన చెర్రీ వారితో వాగ్వాదానికి దిగాడని, ఆ తర్వాత తన వ్యక్తిగత సిబ్బందిని పిలిపించి దాడికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు.

ఈ ఘటనపై బాధితులు ముందుగా పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెబుతూ పోలీసులు వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు పంపించారు. బాధితులు పోలీసు స్టేషన్‍‌లో చెర్రీ, ఆయన అంగరక్షకుల పైన ఫిర్యాదు చేశారు.

English summary
Hero Ram Charan Tej hulchul at Banjara Hills of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X