టిక్కెట్ నాక్కాకుండా ఎవరికిస్తారు?: విశాఖపై టిఎస్సార్

ఇంత ప్రజాసేవ చేసిన వారికి కాకుండా టికెట్ మరెవరికి ఇస్తారన్నారు. ఈసారి తనకు టిక్కెట్ ఖాయమన్నారు. మహిళా ఫోరం ఏర్పాటుపై శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి అధిష్ఠానం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.
వారు గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయిస్తారన్నారు. రెండుసార్లు విశాఖ నుంచి ఎంపీగా విజయం సాధించినా 2009లో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాను పోటీ చేయకుండా, ఆ స్థానంలో కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరిని నిలపాల్సి వచ్చిందన్నారు.
రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు పోటీ చేయరాదని నిర్ణయం తీసుకోవడం వల్లనే తాను అప్పట్లో పోటీ చేయలేదన్నారు. గతంలో పురందేశ్వరి నరసరావుపేట టికెట్ అడిగిన దరిమిలా, ఈసారి అక్కడ ఆమె, విశాఖపట్నంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!