వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూకు గాయాలు: సీటు బెల్టు పెట్టాలని నితీష్ సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Lalu Prasad Yadav
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) ముఖ్య నేత నితీష్ కుమార్ ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సలహా ఇచ్చారు. ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్‌కు చిన్న ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్పందించిన నితీష్ కుమార్ ఆయనకు పరోక్షంగా ప్రమాదంపై సూచనలు చేశారు. ఎవరైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్టును తప్పనిసరిగా పెట్టుకోవాలని హితవు పలికారు.

ముందు సీటులో కూర్చున్న వారు తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలని, ఇది ట్రాఫిక్ నార్మల్ రూల్ అని ఆయన చురక వేశారు. తాను లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం అంశంపై వివరాలు తెప్పించుకున్నానని చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానని చెప్పారు.

కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ఓ చిన్న ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన కారులో వెళ్తుండగా కారు అద్దాలు తగిలి తలకు, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం అతను తన వ్యక్తిగత కార్యదర్శితో కలిసి వైశాలి జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

లాలూకు గాయాలు కావడంతో అతనిని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. ఇతని తలకు రెండు కుట్లు పడ్డాయి. ఈ ఘటన శనివారం రాత్రి పది గంటల సమయంలో జరిగిందని, రాఘవపూర్‌కు వెళ్లే దారిలో పాంటూన్ బ్రిడ్జి వద్ద జరిగిందని లాలూ పిఏ తెలిపారు.

English summary

 People sitting in the front seat of should fasten the seat belt, Bihar chief Nitish Kumar joked on Monday while making light about bigwigs enquirign about RJD chief Lalu Prasad Yadava after accident on May 4 in Vaishali district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X