వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక: ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

SM Krishna
బెంగళూర్: కాంగ్రెసు పార్టీ తనంత తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యం దిశగా సాగుతోంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ తీవ్రమైనట్లే భావించాలి. మొత్తం 224 సీట్లకు గాను 223 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ స్థానాల్లో ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెసు పార్టీ 112 స్థానాలు సాధిస్తే తనంత తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకునే దిశగానే కాంగ్రెసు సాగుతోంది.

పలువురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో కేంద్ర మంత్రి ఎస్.ఎం.కృష్ణ, కర్నాటక పిసిసి అధ్యక్షుడు పరమేశ్, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మల్లికార్జున ఖార్గేలతో పాటు మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా ఉన్నారు. వీరిలో సిద్ధరామయ్య విజయం సాధించారు.

శానససభ ఎన్నికలకు ఎస్ఎం కృష్ణ, వీరప్ప మొయిలీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే, ఎస్ఎం కృష్ణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఎస్ఎం కృష్ణ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాము 120 స్థానాలు గెలుస్తామని పరమేశ్వర అంటున్నారు. బిజెపి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓటమి పాలయ్యారు.

తమ పార్టీ విజయపథాన సాగుతుండడంతో కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెసు కార్యాలయాల వద్ద కాంగ్రెసు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయం వద్ద కూడా సంబరాలు జరుగతున్నాయి. కాంగ్రెసు నాయకులు ఆనందసముద్రంలో మునిగి తేలుతున్నారు.

English summary
Union ministers SM Krishna and Veerappa Moily along with Sidharamaiah and Paramesh are in CM post race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X