వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై కుమార అసహనం, భార్య గెలుపుపై ధీమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kumara Swamy and Anitha
బెంగళూరు: ప్రజల తీర్పును గౌరవించి తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని జెడి(ఎస్) నేత కుమార స్వామి బుధవారం అన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెసు మొదటి స్థానంలో, బిజెపి మూడో స్థానంలో ఉండగా జెడి(ఎస్) రెండో స్థానంలో ఉంది. దీనిపై కుమార స్వామి స్పందించారు.

తమకు ఎవరి నుండి ఎలాంటి సహకారం లేకున్నా, డబ్బు లేకున్నా యాభై సీట్ల వరకు గెలుచుకుంటామన్నారు. ఫలితాలపై తానేమీ నిరాశ చెందడం లేదన్నారు. పర్జల తీర్పును గౌరవిస్తామన్నారు. తన భార్య అనిత వెనుకంజలో ఉన్నప్పటికీ గెలుస్తుందన్నారు.

తాము ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. తానేమీ కింగ్ మేకర్‌ని కాదని మొదటి రోజే చెప్పానన్నారు. రాజు ఎవరవుతారో, రాజును చేసే వారు ఎవరవుతారో తనకు తెలియదన్నారు. మొదటి నుండి తమకు మీడియా సహకరించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెసు గెలుస్తుందనే అభిప్రాయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది: ఖర్గే

ముఖ్యమంత్రి తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అధిష్టానం సూచనల మేరకే తాము నడుచుకుంటామన్నారు.

ఓట్ల చీలిక వల్లే: రవిశంకర ప్రసాద్

కర్నాటకలో బిఎస్సార్ కాంగ్రెసు, కెజెపి పార్టీలు బిజెపి ఓట్లను చీల్చాయని అందుకే ఓటమి చెందామని బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర ప్రసాద్ అన్నారు. తమ పార్టీ నుండి వెళ్లి వారు రాజకీయా పార్టీలు నెలకొల్పడం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్నారు. కర్నాటక ఫలితాలతో మురిసిపోతున్న కాంగ్రెసు దమ్ముంటే ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలని వెంకయ్య నాయుడు సవాల్ చేశారు.

English summary
JDS leader H D Kumaraswamy said he would quit from his MP post. He was also confident about his wife Anitha's victory although she was trailing till the last reports came in. On the question of Siddaramaiah becoming the CM, he said it was the Congress's internal matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X