వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరిపై చెప్పుడు మాటలు: సోనియా డుమ్మా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - Daggubati Purandheswari
న్యూఢిల్లీ: కొందరు పార్లమెంటు సభ్యుల చెప్పుడు మాటల వల్లనే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణకు హాజరు కాలేదనే మాట వినిపిస్తోంది. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై వ్యతిరేకతతోనే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కొందరు సోనియాను కలిసి విగ్రహావిష్కరణకు వెళ్లకూడదని సూచించినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సోనియా రాకపోవడాన్ని మాజీ ప్రధాని పివి నర్సింహారావు విషయంలో అనుసరించిన విధానానికి సంబంధం అంటగట్టి సోనియాపై విమర్శలు చేస్తున్నారు.

మాజీ ప్రధాని పివి నరసింహారావు భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనివ్వకుండా చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చాలామంది తప్పుబట్టారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రాకుండా సోనియాగాంధీ తప్పు చేశారని అంటున్నారు. కొద్దిమంది ఎంపీల చెప్పుడు మాటలు విని సోనియా తన స్థాయికి భిన్నంగా వ్యవహరించారని అంటున్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందువల్ల తామెలా వెళ్తామని పనబాక లక్ష్మి, కేఎస్‌రావు, సాయిప్రతాప్, అనంత వెంకటరామిరెడ్డి చెప్పడం వల్ల, మరో ఒకరిద్దరు పార్లమెంటు సభ్యులు ఆమెకు ఇచ్చిన సలహా వల్ల సోనియా రాలేదని అంటున్నారు.

సోనియా గాంధీ రావడం లేదని తెలిసినా కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, బాపిరాజు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి విగ్రహావిష్కరణకు వచ్చారు. కేవలం పురందేశ్వరి పట్ల వ్యతిరేకతతోనే కొందరు విగ్రహావిష్కరణకు వెళ్లలేదని, సోనియాను కూడా వెళ్లకుండా అడ్డుపడ్డారని వ్యాఖ్యానాలు వినపడ్డాయి. ఏమైనా ఈ కార్యక్రమానికి వెళ్లే విషయంలో కాంగ్రెస్ ఎంపీలలో చీలికలు స్పష్టంగా కనపడ్డాయి.

చంద్రబాబుకు ప్రాధాన్యం లభించినా ఈ కార్యక్రమం సుఖాంతం అయినందుకు పలువురు పురందేశ్వరిని అభినందించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రత్యేకంగా పురందేశ్వరిని పిలిచి ఆహ్వానాల విషయంలో తాను ప్రశ్నించినందుకు ఏమీ అనుకోకూడదని, కార్యక్రమం బాగా జరిగిందని అభినందించారు.

English summary

 It is said that due to few MPs, who are against Daggubati Purandheswari, suggestions Congress president Sonia Gandhi kept herself away from unveiling programme of NT Rama Rao statue in the Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X