వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలతో రామ్ చరణ్ రచ్చ: చిరంజీవికి తలనొప్పి?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టెక్కీలతో టాలీవుడ్ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ గొడవ రచ్చరచ్చగా మారుతోంది. రామ్ చరణ్ తేజ గార్డులు తమపై దాడి చేశారని ఇద్దరు టెక్కీలు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ చిరంజీవికి తలనొప్పిగా మారినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండడంతో తప్పెవరిదైనా తలనొప్పి చిరంజీవికే ఉంటుందని అంటున్నారు. టెక్కీలు తనకు క్షమాపణ చెప్పారని రామ్ చరణ్ చేసిన ప్రకటన గురువారంనాటి ఘటనతో తేలిపోయింది. ఇది మరింత సమస్యగా మారింది.

తమను ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ న్యాయవాది సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేరారు. చిరంజీవి కేంద్ర మంత్రి కావడం వల్లనే పోలీసులు రామ్ చరణ్‌పై కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై 18వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశశించింది.

Techies and Chiranjeevi

క్షమాపణ కోరుతూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోలీసులకు లేఖ ఇచ్చారని రామ్ చరణ్ చెప్పడంలో నిజం లేదని ఫణీష్ ఓ ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. దీంతో వివాదం మొదటికి వచ్చింది. అయితే, క్షమాపణ కోరుతూ టెక్కీల నుంచి తమకు ఎటువంటి లేఖ కూడా ఇవ్వలేదని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అనవసరమైన ఇబ్బందులు వస్తాయని తమ కుటుంబ సభ్యులు చెప్పడం వల్లనే తాము ఫిర్యాదు చేయలేదని ఫణీష్ అన్నారు. దీంతో రామ్ చరణ్ తేజా గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చారు. తానే వారిపై దయ చూపినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు పెడితే టెక్కీలు విదేశాలకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతోనే తాను కరుణ చూపినట్లుగా చెప్పుకొచ్చారు. తాను చాలా హుందాగా ప్రవర్తించానని, కారు నుంచి కూడా దిగలేదని ఆయన అన్నారు.

ఫోటోలను మార్ఫింగ్ చేశారని, ఫోటోలు తీసిన వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ చేశారని రామ చరణ్ చెప్పారు. వారు ఇద్దరు ఉన్నారని, తనతో పాటు తన భార్య ఉపాసన ఉందని ఆయన చెప్పారు. వారే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. రచ్చ ఇలాగే కొనసాగితే తాను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించే ధోరణిలో రామ్ చరణ్ అన్నారు. మొత్తం వివాదం రచ్చ రచ్చ అయ్యేట్లే ఉంది.

English summary
The controversy over union minister Ram Charn Tej's bady gaurds alleged attack on techies is continuing. As the techie Phaneesh condemned his statement, Ram Charan Tej addressed the media today on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X