వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజమాని మాటలే..: సిబిఐ పంజరంలో చిలుక: సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: కోల్‌గేట్ వ్యవహారంలో సిబిఐ పైన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిబిఐ పంజరంలో చిలుక వలె మారిందన్నారు. బొగ్గు స్కాం కేసులో సిబిఐ సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వాధికారుల సూచన మేరకు సిబిఐ దర్యాప్తు నివేదిక ఆత్మనే మార్చేశారని వ్యాఖ్యానించింది. ఇందులో జోక్యం చేసుకున్నందుకు కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.

దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఎక్కడుందని ప్రశ్నించింది. ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్న సిబిఐని కూడా మందలించింది. కీలక కేసుల దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రకాల ఒత్తిడులను సమర్థంగా ఎదుర్కోవాలని, బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు నివేదికను న్యాయశాఖ మంత్రి సహా ఎవరితోనూ పంచుకోవద్దని, దీనికి సిబిఐ డైరెక్టర్ నేరుగా బాధ్యత వహించాలని ఆదేశించింది.

సిబిఐని స్వతంత్ర సంస్థగా మారుస్తామంటూ హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా కోరింది. దానికి స్వేచ్ఛనివ్వని పక్షంలో తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. అదే సమయంలో సిబిఐకి అసాధారణ అధికారాలివ్వడం కూడా కుదరదని జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సిబిఐకి స్వతంత్రత కల్పించేందుకు జూలై 10లోగా ప్రత్యేక చట్టం చేయాలని, ఇందుకు చేపట్టిన చర్యలపై అదే రోజున అఫిడవిట్ సమర్పించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ అంశంపై బుధవారం మూడు గంటలపాటు సాగిన విచారణలో అటార్నీ జనరల్ జీఈ వాహనవతి, అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్, ప్రధాని కార్యాలయం, బొగ్గుశాఖ అధికారులపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తు నివేదికలో అధికారులు మార్పులు ఎలా చేయగలిగారని మండిపడింది. దర్యాప్తుతో వారికి సంబంధమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ సూచనల మేరకు నివేదిక ఆత్మనే మార్చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ సూచన మేరకే తాను సిబిఐ అధికారులతో భేటీ అయ్యానని, సిబిఐ నివేదిక కాపీని తాను కోరలేదని అటార్నీ జనరల్ వాహనవతి కోర్టుకు తెలిపారు. ఇక బొగ్గు కుంభకోణం దర్యాప్తులో ఇప్పటికీ పెద్దగా పురోగతి లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలో బొగ్గుస్కాంపై దర్యాప్తు జరిపిన డిజిపి రవికాంత మిశ్రాకే తిరిగి ఈ కేసు బాధ్యతలు అప్పగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, సిబిఐని ఆదేశించింది.

English summary

 The Supreme Court has questioned the credibility of CBI probe into the coal scam and has asked for a thorough and qualitative investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X