వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరిపై కొణతాల ఫైర్: కిరణ్ రెడ్డికి సిఆర్ చేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Konathala Ramakrishna
విశాఖపట్నం/ కర్నూలు: తాను కాంగ్రెసులో చేరుతానంటూ వస్తున్న వార్తలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. తన కోసం కాంగ్రెసు తలుపులు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటనపై ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెసులోకి వెళ్తానని ఎవరు చెప్పారని ఆయన అడిగారు. తనపై కాంగ్రెసు నాయకులు చర్చించుకుంటే తాను చేసేదమీ లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు నాయకులు పగటి కలలు కంటే తాను చేసేదేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ నాయకుల ఇష్టానిష్టాలతో తనకు పనిలేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల కోసమే జగన్‌కు బెయిల్‌ రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీశైలం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య డుమ్మా కొట్టారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు శ్రీశైలం చేరుకున్న వెంటనే సాక్షి గణపతి ఆలయన్ని సీఎం దర్శించుకున్నారు.

దేవాదాయ శాఖ మంత్రిగా ఆ పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సి. రామచంద్రయ్య స్వాగతం చెప్పాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. కడపలోనే సి. రామచంద్రయ్య ఉన్నారు. తనకు అధికారులు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని ఆయన అలక వహించినట్లు చెబుతున్నారు. తనను ఉద్దేశ్యపూర్వకంగానే అధికారులు విస్మరిస్తున్నారని రామచంద్రయ్య మండిపడుతున్నట్లు సమాచారం.

చిరంజీవిని సి. రామచంద్రయ్య ఇటీవల ఆకాశానికెత్తుతూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో చిరంజీవికి మించిన నాయకుడు లేడని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవేనని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో సి. రామచంద్రయ్యకు, ముఖ్యమంత్రికి మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

English summary
The YSR Congress party leader Konathala Ramakrishna has refuted the union minister Daggubati Purandheswari comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X