వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేటేయండి: జగన్ ఎమ్మెల్యేల సవాల్, సిద్ధమన్న గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Gandra Venkataramana Reddy
హైదరాబాద్: అనర్హత వేటు అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నారు. తాము తమ పార్టీల విప్‌లను ధిక్కరించామని, స్పీకర్ ఎదుటే తాము అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశామని, ఈ అంశంపై స్పీకర్ తమకు నోటీసులు ఇస్తే తాము రాతపూర్వకంగా తమపై వేటు వేయాలని వివరణ ఇదివరకే ఇచ్చామన్నారు.

బహిరంగంగా కూడా వేటు వేయాలని కోరామన్నారు. అలాంటప్పుడు తమను మరోసారి పిలువడమెందుకని జగన్ వర్గం ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు ప్రశ్నించారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ పైన ఒత్తిళ్లు ఉన్నట్లుగా తమకు అనుమానం కలుగుతోందన్నారు. తమపై వేటు వేయాలని, జూన్ 2లోపు వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయని తాము కోరామని వారు అన్నారు. మరోసారి తాము వ్యక్తిగతంగా స్పీకర్ ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు.

గైర్హాజరును ఖండించిన గండ్ర

స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పుడు ఎమ్మెల్యేలు ఎదుట హాజరుకాకపోవడమేమిటని గండ్ర వెంకటరమణ రెడ్డి జగన్ వర్గం రెబల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. తాము ఎన్నికలకు భయపడటం లేదన్నారు. వారు ఎదుట హాజరుకాకుండా లేఖలు రాయడం సరికాదన్నారు. స్వతంత్ర శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ పైన కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వారిపై త్వరగా వేటు వేయాలని తాను స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు.

విచారణకు రాకుండా ఫ్యాక్స్‌లు పంపడం ద్వారా వారు స్పీకర్‌ను అగౌరవపర్చారన్నారు. పార్టీలు మారే వారికి తగిణ గుణపాఠం చెప్పేలా వారిని ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉండాలన్నారు. కాగా, మద్దాల రాజేష్, గొట్టిపాటి రవికుమార్, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఆళ్ల నాని తదితరులపై ఫిర్యాదు చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp Congress, TDP rebel MLAs challenged Congress and Telugudesam Parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X