• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌కు పిటి వారంట్: సబితకు కోర్టు సమన్లు జారీ

By Pratap
|
Jagan - Sabitha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు సోమవారం పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ కేసులోని ప్రధాన నిందితుడు వైయస్ జగన్‌కు కోర్టు పిటి వారంట్ జారీ చేసింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా 12 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. జూన్ 7వ తేదీన తమ ముందు హాజరు కావాలని సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్నారు. రెండో నిందితుడుగా విజయసాయి రెడ్డి, మూడో నిందితుడిగా పుణీత్ దాల్మయా, ఐదో నిందితురాలిగా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఆరో నిందితుడిగా రాజగోపాల్, ఏడో నిందితుడిగా సజ్జల దివాకర్ రెడ్డి, ఎనిమిదో నిందితుడిగా సంజయ్ ఎస్ మిత్రా, తొమ్మిదో నిందితుడిగా నీల్ కమల్ ఉన్నారు. పదో నిందితుడిగా జయదీప్ బసు ఉన్నారు. 11, 12, 13 నిందితులుగా రఘురామ్ సిమెంట్స్, ఈశ్వర్ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ ఉన్నాయి.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి పనిచేశారు. ఈ సమయంలో దాల్మియా సిమెంట్స్‌కు సున్నంరాయి కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపులకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ వైయస్ జగన్ సంస్థల్లో 95 కోట్ల రూపాయలు పెట్టిందనేది సిబిఐ అభియోగం.

సిబిఐ దాల్మియా సిమెంట్స్‌పై 67 పేజీల చార్జిషీట్‌ను రూపొందించింది. మొత్తం 47 మందిని సాక్షులుగా చేర్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిందని, ఫలితంగా జగన్ కంపెనీల్లో 95 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని సిబిఐ ఆరోపిస్తోంది. కడప జిల్లా మైలవరం వద్ద దాల్మియా సిమెంట్స్‌కు 407 హెక్టార్ల సున్నంరాయి గనులను 30 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టారు. దాల్మియా సిమెంట్స్ జగన్‌కు భారతి సిమెంట్స్‌లో 50 కోట్ల రూపాయలు, జగతి పబ్లికేషన్స్‌లో 45 కోట్లు రూపాయలు పెట్టుబడులుగా పెట్టిందని ఆరోపణ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking into consideration of CBI chargesheet on Dalmiya cements in YSR Congress party president YS Jagan DA case by CBI special court issued summons to home minister Sabitha Indra Reddy and 11 others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more