• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆర్మూర్ టిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి: కెసిఆర్ ప్రకటన

By Srinivas
|

K Chandrasekhar Rao
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ ఇంఛార్జిగా జీవన్ రెడ్డిని నియమించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... ఆర్మూర్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యమంత్రి రైతు సదస్సు

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పారు. మాది రైతు ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు.

మొదటిసారి రైతు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే హక్కు కాంగ్రెసుకు మాత్రమే ఉందన్నారు. ఒక్క ఏడాదిలోనే వ్యవసాయానికి రూ.5,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఘనత కాంగ్రెసు ప్రభుత్వానిదన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా రూ.72వేల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు.

English summary
Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao has announced Jeevan Reddy is Armoor TRS MLA candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X