రాజకీయ వ్యభిచారమే: కడియంకు రేవూరి కౌంటర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఫాం హౌస్‌లో కడియం రాజకీయ బేరసారాలు జరుపుతున్నారని ఆరోపించారు. మహానాడులో తెలంగాణపై స్పష్టత వస్తుందని రేవూరి చెప్పారు. పార్టీని విడిచిన ఆయన టిడిపిని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు తనను విమర్శించడాన్ని మాజీ మంత్రి, టిడిపికి రాజీనామా చేసిన కడియం శ్రీహరి ఆదివారం ఖండించిన విషయం తెలిసిందే. తనది రాజకీయ వ్యభిచారం అనడం టిడిపి నేతలకు తగదన్నారు. అది వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ప్రస్తుతం ఆ పార్టీ భావదారిద్ర్యంలో ఉందన్నారు. తాను దళితుడిని కాదని ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడటం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా తాను పార్టీని వీడలేదన్నారు. మహానాడులో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయించాలని ఆయన టిడిపి తెలంగాణ నేతలకు సవాల్ చేశారు. టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సభ్యత, సంస్కారం నేర్చుకోవాలన్నారు. దేవేందర్ గౌడ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి వంటి నేతలు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. రేవూరికి రాజకీయ వ్యభిచారం అంటే అర్థం తెలుసానని ప్రశ్నించారు. దీనికి రేవూరి ఈ రోజు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications