రూ. 2000 ఇవ్వలేదని భార్యను హత్య చేసిన వ్యక్తి

Man kills wife for refusing him Rs 2,000
న్యూఢిల్లీ: రెండు వేల రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. తమ బిడ్డ జన్మదిన వేడుకలకు భార్య రెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ్తను ఆ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో శనివారంనాడు చోటు చేసుకుంది.

నిందితుడిని షానుగా గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మృతురాలిని 20 ఏళ్ల పింకీగా గుర్తించారు. వీరిద్దరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. సంఘటన జరిగిన సమయంలో వారి ఏడాది కుమారుడు నిద్రపోతున్నాడు.

పింకీ బంధువు లక్ష్మి జన్మదిన వేడుకలకు వచ్చి ఇంట్లోనే ఉండిపోయింది. గొడవ జరగడంతో తెల్లవారు జామున రెండు గంటలకు లేచి చూడడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె బయటకు వచ్చి చూసేసరికి శాను పింకీని కొడుతున్నాడు. అతను ఇటుకతో పింకీ తలపై కొట్టాడు.

అల్లరి చేయవద్దని అతను లక్ష్మిని బెదిరించాడు. అయితే, ఆమె గొడవ పెట్టడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూశారు. షానును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పింకీని అస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది. రెండు వేల రూపాయలు ఇవ్వడానికి పింకీ నిరాకరించిందని, దాంతో తనకు కోపం వచ్చిందని షాను పోలీసులకు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+