నీట్ ఈ ఏడు తప్పనిసరి కాదు: రాష్ట్ర విద్యార్థులకు ఊరట

మన రాష్ట్రంలో ఎంసెట్ ఉంది. నీట్ పరీక్షపై మన రాష్ట్ర విద్యార్థులు, కళాశాలలో కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. నీట్‌ను వాయిదా వేయాలని మన రాష్ట్రం కూడా కోరింది. పలు రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు నీట్ ఇప్పుడే వద్దంటూ పిటిషన్‌లు వేశాయి. నీట్ నిర్వహణపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఏడాది పాతపద్ధతిలోనే వైద్య విద్యా ప్రవేశాలు నిర్వహించవచ్చునని సుప్రీం కోర్టు పేర్కొంది. పెండింగ్ ఫలితాలు విడుదలకు సుప్రీం కోర్టు అనుమతించింది. దీంతో మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారానే ఈ ఏడాది మెడికల్ అడ్మిషన్లు జరుగనున్నాయి. ఇది వైద్య విద్యార్థులకు ఊరట. నీట్ పరీక్షపై జూలై 2వ తేదిన తుది తీర్పును వెలువరించనుంది.












Click it and Unblock the Notifications