వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్ ఈ ఏడు తప్పనిసరి కాదు: రాష్ట్ర విద్యార్థులకు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష ఈ ఏడాది తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది. వైద్య రంగంలో ప్రమాణాలు పెంచేందుకు జాతీయస్థాయిలో ఒకే తరహాలో నీట్ పరీక్షను నిర్వహించేందుకు మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. దీనిపై సుప్రీం కోర్టులో దేశంలోని పలు రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు 92 పిటిషన్‌లు దాఖలు చేశాయి.

మన రాష్ట్రంలో ఎంసెట్ ఉంది. నీట్ పరీక్షపై మన రాష్ట్ర విద్యార్థులు, కళాశాలలో కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. నీట్‌ను వాయిదా వేయాలని మన రాష్ట్రం కూడా కోరింది. పలు రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు నీట్ ఇప్పుడే వద్దంటూ పిటిషన్‌లు వేశాయి. నీట్ నిర్వహణపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ఏడాది పాతపద్ధతిలోనే వైద్య విద్యా ప్రవేశాలు నిర్వహించవచ్చునని సుప్రీం కోర్టు పేర్కొంది. పెండింగ్ ఫలితాలు విడుదలకు సుప్రీం కోర్టు అనుమతించింది. దీంతో మన రాష్ట్రంలో ఎంసెట్ ద్వారానే ఈ ఏడాది మెడికల్ అడ్మిషన్లు జరుగనున్నాయి. ఇది వైద్య విద్యార్థులకు ఊరట. నీట్ పరీక్షపై జూలై 2వ తేదిన తుది తీర్పును వెలువరించనుంది.

English summary
Giving relief to lakhs of medical aspirants, the Supreme Court today cleared the decks for admission to MBBS, Dental and PG medical courses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X