వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్ ముందుకు రాని టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణకు తెలుగుదేశం తిరుగుబాటు శానససభ్యులు గైర్హాజరయ్యారు. స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వడానికి వారు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది. వారు మంగళవారం స్పీకర్ ముందు హాజరు కాలేదు. అయితే, తెలుగుదేశం పార్టీ విప్ దూళిపాళ నరేంద్ర చౌదరి స్పీకర్ ముందు హాజరై తన వాదనను వినిపించారు.

పార్టీ విప్‌ను ధిక్కరించిన తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని నరేంద్ర చౌదరి స్పీకర్‌ను కోరారు. విప్‌ను ధక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై తెలుగుదేశం శానససభా పక్షం (టిడిఎల్పీ) ఇదివరకు ఫిర్యాదు చేసింది. అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉండాలంటూ టిడిఎల్పీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే, వారంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు.

విప్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ టిడిఎల్పీ స్పీకర్‌కు సమర్పించిన జాబితాలో తెలుగుదేశం శాసనసభ్యులు శిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), వేణు గోపాలాచారి (ముధోల్)లు ఉన్నారు.

హరీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడగా, వేణుగోపాలాచారి నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ నగారా సమితిలో ఉన్నారు. మిగతా ఏడుగురు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెసు తిరుగుబాటు శానససభ్యులు 9 మంది కూడా సోమవారం స్పీకర్ ముందు హాజరు కాలేదు.

తమపై వేటు వేయాలని వారు కోరారు. వేటు వేయాలని కోరినప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావాల్సిన అవసరమేమిటని వారు అడిగారు.

English summary

 The Telugudesam rebel MLAs not attended to the enquiry of assembly speaker Nadendla Manohar today. TDP complianed against 9 rebel MLAs to the speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X