వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటిఆర్‌తో చిచ్చు పెట్టలేరు: రఘునందన్‌పై హరీష్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: పార్టీ నుంచి వేటు పడిన రఘునందన్ రావు తనపై చేసిన ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు మండిపడ్డారు. తనకూ తమ పార్టీ శాసనసభ్యుడు కెటి రామారావుకు మధ్య చిచ్చు పెట్టలేరని ఆయన అన్నారు. కెటిఆర్‌ను ఓడించడానికి హరీష్ రావు ప్రయత్నించారని రఘునందరావు విమర్శించారు. ఈ విమర్శపై హరీష్ రావు ఆ విధంగా స్పందించారు. కెటిఆర్ తానూ కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

రఘునందన్ చేసిన ఆరోపణలను అన్నింటినీ తాను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. ఆరోపణలను రఘునందన్ రావు రుజువు చేస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. రఘునందన్ ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తాను గతంలో అందరి ముందే పట్టపగలు కలిశానని, అందులో రహస్యమేమీ లేదని, సిద్ధిపేటలో డిగ్రీ కళాశాల విషయంపై తాను వైయస్‌ను కలిశానని ఆయన వివరించారు.

తాను నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తున్నానని, రాజకీయాలనూ పదవులనూ వదులుకుంటాను గానీ విలువలను వదులుకోబోనని అన్నారు. కెసిఆర్ నుంచి విలువలను, పద్ధతులను తాను నేర్చుకున్నానని, వాటికి కట్టుబడి పని చేస్తానని ఆయన చెప్పారు. అశోకా హోటల్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని హరీష్ రావు చెప్పారు.

రఘునందన్ రావు నుంచి తాను ఐదు వేలో పదివేలో తీసుకున్నానని, ఆ విషయం తనకు గుర్తు లేదని, అవసరం కోసం తాను ఆ డబ్బులు తీసుకున్నానని, పదవి ఇప్పిస్తానని తీసుకోలేదని ఆయన అన్నారు. ఉద్యమంలో తాను ఎంతో మందికి ఐదు వేలు, పదివేలు సాయం చేశాననిఆయన చెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే రఘునందన్ రావు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
The Telangana Rastra Samithi (TRS) MLA T Harish Rao condemned Raghunandan Rao's allegations made against him. He said Raghunandan Rao can not create rift between him and KT Rama Rao (KTR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X