వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటికి దెబ్బ: జగన్ పార్టీలో చేరిన అడుసుమిల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Adusumilli Jayaprakash
హైదరాబాద్: మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ బుధవారంనాడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలువైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలోపేతానికి తాను తన వంతు కృష్టి చేస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

అడుసుమిల్లి జయప్రకాష్ కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు అత్యంత సన్నిహితుడు. లగడపాటికి ఆయన చేదోడు వాదోడుగా ఉండేవారు. అడుసుమిల్లి జయప్రకాష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం లగడపాటికి కొంత ఇబ్బందికరమేనని చెప్పవచ్చు.

ఇదిలావుంటే, విచారణ నిమిత్తం తాను స్పీకర్ ముందు హాజరు కాబోనని బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు చెప్పారు. వైయస్ జగన్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన బుధవారం విజయనగరంలో చెప్పారు. తనపై విప్ ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన కన్నా ముందే తాను రాజీనామా చేశానని, అందువల్ల తనపై చర్యలు తీసుకునే హక్కు లేదని ఆయన అన్నారు. అటువంటి చర్య రాజ్యాంగ విరుద్ధమని, ఏడాది గడువు ఉండగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు ఉండవనే ఈసి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు డ్రామా ఆడుతున్నాయని ఆయన విమర్శించారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal loyalist and former MLA Adusumilli Jayaprakash joined YS Jagan's YSR Congress party in the presence of YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X