వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్ర: ధోనీ, భజ్జీలపై పేసర్ శ్రీశాంత్ తండ్రి నిందలు

By Pratap
|
Google Oneindia TeluguNews

S Sreesanth
ముంబై‌: స్పాట్ ఫిక్సింగ్‌లో తన కుమారుడు పట్టుబడడంపై భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను తప్పు పడుతున్నాడు. కుట్రలో భాగంగానే తన కుమారుడు శ్రీశాంత్ అరెస్టు జరిగిందని ఆయన అన్నారు. కుట్రలో ధోనీ, హర్భజన్ పాలు పంచుకున్నారని ఆయన ఆరోపించారు.

స్పాట్ ఫిక్సింగ్‌లో రాజస్థాన్ రాయల్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలలను గురువారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీశాంత్‌కు తండ్రి అండగా నిలిచాడు. తన కుమారుడు అమాయకుడని, కుట్రకు బలయ్యాడని ఆయన అన్నారు.

తన కుమారుడు శ్రీశాంత్ క్రికెట్ కెరీర్‌ను అంతం చేయడానికి ధోనీ, హర్భజన్ కుట్ర చేశారని శాంతకుమారన్ హిందుస్థాన్ టైమ్స్ వార్తాపత్రికతో అన్నారు. పంజాబ్ పోలీసు డిప్యూటీ సూపరింటిండెంట్ హర్భజన్ కుట్రను అమలు చేసినట్లు ఆయన ఆరోపించాడు. భారత జట్టులోకి శ్రీశాంత్ రాలేడని ధోనీ ఇటీవల హెచ్చరించాడని ఆయన గుర్తు చేశాడు.

శ్రీశాంత్ అమాయకుడని, నిబద్ధత గల ఆటగాడని, అటువంటి పనులు శ్రీశాంత్ చేయబోడని శ్రీశాంత్ బావ, నేపథ్య గాయకుడు మధు బాలకృష్ణన్ అన్నారు.

English summary
Paceman S Sreesanth's father Shanthakumaran Nair has blamed India captain MS Dhoni and offspinner Harbhajan Singh for being part of a conspiracy in getting the fast bowler arrested in IPL spot-fixing scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X