వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌ఎస్‌సి ఫలితాలు విడుదల: బాలికలదే పైచేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

SSC Results 2013
హైదరాబాద్: ఎస్ఎస్‌సి పదో తరగతి పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. బాలుర కన్నా బాలికలు ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్ఎస్‌సి ఫలితాలను మాధ్యమిక శాఖ మంత్రి పార్థసారథి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. పరీక్ష రాసిన మొత్తం బాలబాలికల్లో 88.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది నిరుటి కన్నా 0.24 శాతం అధికం. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 87.30 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఎస్ఎస్‌సి ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఫలితాల సాధనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు ప్రథమ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణతా శాతం 94.92 శాతం ఉంది. మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 67.09 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయి. 172 ప్రభుత్వ పాఠశాలలు, 5 మునిసిపిల్ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. సున్నా ఉత్తీర్ణతను సాధించాయి. 144 గురుకుల పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 1103 జిల్లా పరిషత్ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి.

జూన్ 15 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జూన్ 1వ తేదీ అని మంత్రి చెప్పారు. ఫలితాలు గ్రేడింగ్ పద్ధతిలోనే విడుదల చేశారు. మొదటిసారి ఎస్ఎస్‌సి ఫలితాలను మే నెలలో విడుదల చేసారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందుగా ఫలితాలు విడుదలయ్యాయి.

English summary
SSC results have been released by minister Parthasarathy today. Girls have taken upper hand over boys with 88.90 percent pass.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X