వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డ్స్ కోసం కాదు: రెండు వేలు దాటిన షర్మిల యాత్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila padayatra crosses 2,000 KM
ఏలూరు: తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎంత కాలం జైలులో ఉంచుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం ప్రశ్నించారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటింది. ఆమె యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ, ఇతర నేతలు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ... సిబిఐ ఒక్కొక్కరి పట్ల ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంలో ప్రధానమంత్రికి, అక్కడి మంత్రులకు ఓ న్యాయం, రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ చనిపోయాక బోఫోర్స్ కేసులో ఆయన పేరును తీసేశారని, రాష్ట్రంలో మాత్రం వైయస్ చనిపోయినా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

షర్మిల మాట్లాడుతూ.. తాను రికార్డుల కోసం యాత్ర చేయడం లేదని, జరుగుతున్న అన్యాయాలు, వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చేస్తున్నానని అన్నారు. వైయస్ పాదయాత్రకు కొనసాగింపే ఈ యాత్ర అన్నారు. జగన్ ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకుందామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కుట్రలదారులను, నరకాసురలను సంహరించాలన్నారు. అప్పటిదాగా జరిగేది యుద్ధమే అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు కాంగ్రెసును రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చారని, కేంద్రంలోను ప్రభుత్వ ఏర్పాటుకు వైయస్సే కారణమని, ఆయన మరణించిన తర్వాత కాంగ్రెసు ఆయన కుమారుడిని వేధిస్తోందని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల సమయంలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పిన మాటలే అందుకు నిదర్శనమని ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.

English summary

 YSR Congress Party's Sharmila Maro Praja Prastanam padayatra crossed 2,000 kilometers on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X