వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రావిడ్, శిల్పా శెట్టిలను ప్రశ్నించనున్న పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Dravid and Shilpa Shetty
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు, జట్టు సహ యజమానులు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వారిని కూడా ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు. వారు ముగ్గురు ఈ నెల 21వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కానున్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు ఐపియల్ మ్యాచులు ఫిక్సింగ్ జరిగి ఉంటుందనే సంకేతాలను ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఇచ్చారు.

మరి కొంత మంది రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్, బుక్కీ అమిత్ సింగ్‌ను పోలీసులు విచారించారు. అతని బ్రాడ్ హోడ్జ్, అజింక్యా రహనే పేర్లను వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరిపై కూడా పోలీసులు కన్నేశారు.

ఇంకా కొంత మంది ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో పాలు పంచుకుని ఉంటారని ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ ఓ ఇంగ్లీష్ టీవి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఐపియల్‌కు మాత్రమే ఫిక్సింగ్ పరిమితం కాలేదని ఆయన అన్నారు. ఈ కుంభకోణం వెనక విదేశీ హస్తం ఉందని అభిప్రాయపడ్డారు. అరెస్టు చేసిన బుక్కీల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు.

English summary
According to reports, Rahul Dravid and the rest of the team, including the team owners will be questioned to aid investigation. Questioning likely to take place after May 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X