వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, అంకిత్ పెళ్లిళ్లు పెటాకులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreeshanth and Ankeet Chavan
కొచ్చి/ ముంబై : స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణలపై అరెస్టు కావడంతో క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ వివాహాలు సందేహంలో పడ్డాయి. వారి పెళ్లి ప్రణాళికలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. నిజానికి, అంకిత్ చవాన్ వివాహం జూన్ 2వ తేదీన జరగాల్సి ఉంది. ప్రస్తుత స్థితితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. ముంబైకి చెందిన అంకిత్ చవాన్ పెళ్లి గర్ల్ ఫ్రెండ్‌తో కుదిరింది. ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారని, తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని అంకిత్ చవాన్ సోదరుడు ఓ టీవీ చానెల్‌తో అన్నారు.

శ్రీశాంత్ విషయానికి వస్తే, అతని వివాహం నిశ్చయం కాలేదు. స్పాట్ ఫిక్సింగ్ వివాదం చెలరేగడానికి రెండు రోజుల ముందు తాను సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు శ్రీశాంత్ చెప్పాడు. ఈ వార్తాపత్రికతో అతన ఆ విషయం చెప్పాడు. వివాదం శ్రీశాంత్ ప్రతిష్టను దెబ్బ తీసిందని, పెళ్లికి ఆటంకంగా మారిందని ఆయన బావ మధు బాలకృష్ణ అన్నారు.

శ్రీశాంత్ వివాహం నిశ్చయం కాలేదని, అందుకు సంబంధించిన నిర్దిష్టమైన ఆలోచనలు ఏవీ చేయలేదని శ్రీశాంత్ కుటుంబ సభ్యులు అన్నారు. అమ్మాయి పేరు చెప్పడం తమకు ఇష్టం లేదని, అమ్మాయిని చూస్తున్నామని, ఆమె మలయాళీ కాదని అన్నారు. శ్రీశాంత్, అతని కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని కలిశారు. ఇప్పుడేమవుతుందో చెప్పలేమని అంటున్నారు.

శ్రీశాంత్ కేరళలోని పఠనంథిట్ట జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు రెండేళ్ల క్రితం పుకార్లు పుట్టాయి. పెళ్లి కుదిరే సమయానికి అమ్మాయి తరఫు బంధువులు వెనక్కి తగ్గారు. శ్రీశాంత్ తీరు నచ్చక వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

English summary

 The arrests of Sreesanth and Ankeet Chavan have also put a question mark on their upcoming marriages. Chavan's family is especially caught in a bind since the Mumbai cricketer was supposed to get married on June 2 with his long-time girlfriend and all plans were already in place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X