వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాట్ ఫిక్సింగ్: మరిన్ని దాడులకు పోలీసులు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Spot fixing
న్యూఢిల్లీ: ఐపియల్ మ్యాచు ఫిక్సింగ్‌లకు సంబంధించి మరిన్ని దాడులు నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లతో పాటు 11 మంది బుక్కీలను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాయని సమాచారం.

ఫిక్సింగ్ ఈ ఐపియల్‌కు పరిమితం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అహ్మదాబాద్, ముంబైలకు వెళ్లినట్లు సమాచారం. కాగా, జైపూర్ పోలీసులు బుక్కీలకు చెందిన కాల్ రికార్డులను సమర్పించడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. గత రెండు నెలల కాలంలో వారు 300 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

స్పాట్ ఫిక్సింగ్‌ కేవలం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మాత్రమే పరిమితం కాలేదని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో ఇతర జట్లకు చెందిన మరి కొంత ఆటగాళ్ల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

చండిలకు, బుక్కీలకు మధ్య జరిగిన సంభాషణలను బట్టి చూస్తే నిరుటి మ్యాచుల ఫిక్సింగ్ వ్యవహారాలు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. రూ. 20 లక్షల రూపాయల విషయంలో చెలరేగిన వివాదం సమయంలో చండిల మాట్లాడిన విషయాలు నిరుటి ఫిక్సింగ్ విషయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. నిరుడు కూడా జరగిందని, పరిష్కరించుకుందామని చండిల చెప్పిన మాటలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు.

English summary
The Delhi Police is likely to carry out more raids on Saturday in connection with the spot fixing scandal which rocked this year's Indian premier League (IPL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X