వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఇష్టం: రాజీనామాపై ధర్మాన, తెరాసలోకి టి ఎంపీలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Jagannadham - Dharmana Prasad Rao
హైదరాబాద్/శ్రీకాకుళం: తన రాజీనామాపై వస్తున్న ఊహాగానాల పైన మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆదివారం స్పందించారు. తనపై వస్తున్న ఊహాగానాలపై మీడియా తనకు నచ్చినట్లుగా విశ్లేషించుకోవచ్చునని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను తాను ఇక్కడ మాట్లాడనని చెప్పారు. పార్టీ విషయాలను తాను రాజధాని హైదరాబాదులోనే మాట్లాడతానని ధర్మాన ప్రసాద రావు చెప్పారు.

తెరాసలోకి ఎంపీలు!

తెలంగాణ ప్రాంత ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య, పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని అల్టిమేటం జారీ చేశారు. మే నెలాఖరులోగా తేల్చకుంటే ఏ పార్టీలో చేరేది 30వ తేదిన చెబుతామన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పదే పదే వాయిదా వేస్తోందన్నారు.

తమకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉందన్నారు. నెలాఖరులోగా తేల్చాల్సిందే అన్నారు. పిసి చాకో తెలంగాణ ప్రజలను అవమానపర్చారన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు చాలాసార్లు చెప్పిందని, ఇవ్వకుంటే కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ తమ అజెండా కాదని కాంగ్రెసు అజెండానే అని వివేక్ అన్నారు. మిగతా ఎంపీలు తమ వైఖరిని వారే చెబుతారన్నారు. పిసి చాకో తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు.

కాగా, ఈ నెల 30లోగా తాము ఏ పార్టీలో చేరేది చెబుతామని మందా జగన్నాథం, మిగతా ఎంపీలు వారి వైఖరిని వారే చెబుతారని వివేక్ చెప్పడం ద్వారా వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నారని అంటున్నారు.

English summary

 Minister Dharmana Prasad Rao has responded on his resignations rumors on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X