వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాకో వ్యాఖ్యల ఎఫెక్ట్: టిఆర్ఎస్‌ల చేరికపై ఎంపీల చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao - Vivek
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ ఇంట్లో పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు, ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్యలు ఆదివారం భేటీ అయ్యారు. వారు భవిష్యత్తు కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో వ్యాఖ్యలు తెలంగాణవాదులకు ఆగ్రహం తెప్పించగా.. కాంగ్రెసు పార్టీ నాయకులకు అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు తమ పార్టీ తెలంగాణకు సానుకూలంగా ఉందని చెప్పిన నేతలకు చాకో వ్యాఖ్యలు గుదిబండలా మారాయి. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిసి చాకో వ్యాఖ్యల నేపథ్యంలో వివేక్ ఇంట్లో రాజయ్య, కెకె, మందాలు భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు తెరాసలోకి వెళ్తారనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. ఆ తర్వాత ఆ ప్రచారానికి తెరపడింది. అధిష్టానం హామీ కారణంగానే వారు వెనక్కి తగ్గారని భావించారు.

అయితే ఇప్పుడు పిసి చాకో కాంగ్రెసు తెలంగాణకు అనుకూలం కాదన్నట్లుగా మాట్లాడటంతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపీలు తెరాసలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీరు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మందా జగన్నాథం, రాజయ్యలు ఇప్పటికీ తెరాసతో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Congress Party senior MPs Vivek, Manda Jagannadham and Rajaiah were met party senior leader K Keshav Rao on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X