manda jagannadham vivek rajaiah k keshav rao k chandrasekhar rao telangana మంద జగన్నాథం వివేక్ రాజయ్య కె కేశవ రావు కె చంద్రశేఖర రావు తెలంగాణ
ఆ ఎంపీలకు కెసిఆర్ హామీ: కెకెకు వర్కింగ్ ప్రెసిడెంట్?

భేటీ సమయంలో కెసిఆర్ వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మందా జగన్నాథంకు ప్రస్తుతం ఆయన ప్రాతనిథ్యం వహిస్తున్న నాగర్ కర్నూలు, ఆయన కుమారుడికి ఆలంపూర్, వివేక్‌కు పెద్దపల్లి, ఆయన సోదరుడికి బెల్లంపల్లి, కెకెకు పార్టీలో కీలక పదవితో పాటు ఆయన తనయుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కెకెకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య తెరాస అధినేత సయోధ్య కుదుర్చినట్లుగా సమాచారం. స్టేషన్ ఘనపూర్ నుండి రాజయ్య ఎమ్మెల్యేగా ఉండటంతో కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంటు టిక్కెట్ ఇస్తానని చెప్పి కెసిఆర్ పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు వరంగల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజయ్యను కూడా పార్టీలోకి తీసుకుంటున్నారు.
కడియంకు వరంగల్ లోకసభ టిక్కెట్ ఇస్తే రాజయ్యకు కరీంనగర్ జిల్లా మానకొండురు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. రాజయ్య వరంగల్ టిక్కెట్ కోసమే పట్టుబడితే కడియంను వేరే చోట సర్దుబాటు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక మానకొండూరు నుండి పోటీ చేసేందుకు రసమయి బాలకిషన్ ఆసక్తి చూపిస్తుండటంతో రాజయ్యను చొప్పదండికి మార్చే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.