వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదు: ఆంటోనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Antony
న్యూఢిల్లీ: తెలంగాణపై ఇప్పటి వరకు ఏ విధమైన తుది నిర్ణయం తీసుకోలేదని రక్షణ మంత్రి, కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యుడు ఎకె ఆంటోనీ చెప్పారు. బుధవారం రాత్రి యుపిఎ వార్షికోత్సవాలు జరిగిన ప్రధాని నివాసం వద్ద ఆయన పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. యుపిఎ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా క్లుప్తంగా మాట్లాడారు. ప్రధానికి సోనియా తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రధాని 2012 -13 ప్రగతి నివేదికను విడుదల చేశారు.

ప్రధానితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ మీడియాతో కలుపుగోలుగా మాట్లాడారు. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రధాన మంత్రి పదవి రేసులో తాను లేనని, ఈ విషయం తాను ఎన్నో సార్లు చెప్పానని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ సమర్థుడని, చక్కగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. నాయకత్వాన్ని మార్చే ప్రసక్తి లేదని, ప్రధానికీ సోనియాకూ మధ్య విభేదాలు లేవని రాహుల్ గాంధీ అన్నారు.

యుపిఎ వార్షికోత్సవాలకు మిత్రపక్షాల నేతలతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడ్డారని భావిస్తున్న ఇద్దరు పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య, జి. వివేక్ సమావేశానికి హాజరయ్యారు. రాకపై ప్రశ్నించినప్పుడు - సోనియాను, రాహుల్ గాంధఈని కలిసి విజ్ఞప్తి చేసేందుకు చివరి యత్నం చేస్తున్నట్లు వారు తెలిపారు.

రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, పనబాక లక్ష్మి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లతో పాటు నాయకులు కెఎస్ రావు, టి. సుబ్బిరామిరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నంది ఎల్లయ్య, కెవిపి రామచందర్ రావు, ఎంఎ ఖాన్, బొత్స ఝాన్సీ తదితరులు హాజరయ్యారు.

English summary

 The union minister AK Antony said final decission on Telanagna has not been taken. Rahul Gandhi said that he is not in PM race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X