వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ లైఫ్ తర్వాత ఎస్ 36తో శ్రీశాంత్ ఫ్యూచర్ ప్లాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన కేరళ పేసర్ శ్రీశాంత్ భవిష్యత్తులో క్రికెట్ కెరీర్‌కు పూర్తయ్యాక బెట్టింగ్ వ్యాపారం చేయాలని భావించాడా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీశాంత్ మూడేళ్ల క్రితం ఎస్ 36 పేరుతో కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ నుండే శ్రీశాంత్ ఈమెయిల్‌కు అమ్మాయిల ఫోటోలు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఎస్ 36 దుస్తులు, క్రీడా వస్తువులకు సంబంధించిన కంపెనీయే కాకుండా మ్యూజిక్ బ్యాండ్ కూడా. ఇందులో శ్రీశాంత్ వాటా 74. మిగిలినది మాజీ కోచ్ శివ కుమార్‌ది. ఎస్ 36 సంస్థను కర్నాటకలో రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ సమయంలో తన కంపెనీ జాబితాలో భారత్‌తో పాటు విదేశాలలో బెట్టింగ్ వ్యాపారం నిర్వహించుతామని పేర్కొంది.

శ్రీశాంత్ తన క్రికెట్ కెరీర్ అనంతరం కోసమే ఎస్ 36 సంస్థను స్థాపించి విదేశాల్లో ఉండి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని భావించారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీశాంత్ రిటైర్మెంట్ అనంతర జీవితం కోసం ఈ సంస్థను స్థాపించామని, అతను విదేశాల్లో స్థిరపడితే బెట్టింగ్ కేంద్రాలు నడుపగలడని, బెట్టింగును అనుమతించే దేశాలు ఉన్నాయని శివకుమార్ చెప్పాడు. ఇతను గతంలోనే సంస్థ డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నాడు.

శ్రీశాంత్ తన ఎస్ 36 సంస్థ ద్వారా చాలా ఏళ్ల నుండి బెట్టింగులకు పాల్పడుతున్నాడా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. తాను అమాయకుడినని చెప్పినప్పటికీ శ్రీశాంత్ మరిన్ని చిక్కుల్లో చిక్కుకోక తప్పదని అంటున్నారు.

English summary
Sreeshanth owns a company to run betting houses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X