వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు, 12 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 'Bomb blast in Pakistan's Quetta kills 12 people'
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పాక్ సౌత్ వెస్ట్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉపయోగించే ఓ రిక్షాలో బాంబు పెట్టి పేల్చారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దాదాపు 100 కిలోల బరువైన బాంబును పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం పార్లమెంటరీ దళాలతో క్వెట్టా ఔట్ స్కర్ట్స్‌కు వెళ్తున్న ట్రక్‌ను లక్ష్యంగా ఈ బాంబును పేల్చారు. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉంది. పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ అతి పెద్ద ప్రాంతమే కాకుండా, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం.

ఈ ప్రాంతంలో ఇస్లామిస్ట్ వాదులు తరుచూ భద్రతా దళాల పైన దాడులు చేయడం సాధారణంగా మారిపోయింది. చనిపోయిన 12 మందిలో 11 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని పోలీసు అధికారి ఫయ్యాజ్ చెప్పారు. బాంబును రిక్షాలో పెట్టారని, భద్రతా దళాలే లక్ష్యంగా దీనిని అమర్చారని చెప్పారు.

ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారని చెప్పారు. బాంబు నిర్వీర్య దళాలు బాంబు పేలుడు జరిగిందని చెప్పారు. వారి మృతికి అదే కారణమని చెప్పారు. బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉంటుంది. పది రోజుల క్రితం భద్రతా సిబ్బంది ఓ బాంబు పేలుడు నుండి తప్పించుకున్నారు.

English summary
A bomb planted in a rickshaw tore through a vehicle used by security forces in southwest Pakistan on Thursday, killing at least 12 people, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X