హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీకి రూ.1200: చిరంజీవి ఇంటిని ముట్టడించిన ఓయు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పర్యాటక శాఖ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు గురువారం రాత్రి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇంటిని ముట్టడించారు. చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా, వీరిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పర్యాటక సదస్సు పేరుతో భారీ కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు.

దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయు జెఏసి అధికార ప్రతినిధి కృశాంక్ మాట్లాడుతూ... ఏప్రిల్ 12, 13స 14 తేదీలలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం కాన్ఫరెన్స్ నిర్వహించారని, ఇందుకోసం రూ.2.14 కోట్లు ఖర్చు చేశారన్నారు.

ఈ ఖర్చు వివరాలను తాము సమాచార హక్కు చట్టం కింద సేకరించగా... కప్పు టీకి రూ.1200ల చొప్పున రూ.2.40 లక్షలు, భోజనాలకు ఒక్క ప్లేటుకు రూ.3500 చొప్పున రూ.5.25 లక్షలు ఖర్చు చేశారన్నారు. పదిమంది ప్రతినిధులు పార్క్ హయత్‌లో వై ఫై(ఇంటర్నేట్) ఉపయోగించుకున్నదుకు రూ.2.40 లక్షలు, ఫోన్ కాల్స్‌కు రూ.1.20 లక్షలు... ఇలా ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారన్నారు.

ఎనిమిది ప్రాంతాల్లో హోర్డింగులకు రూ.25 లక్షలు, మరో ఆరు ప్రాంతాల్లో రెప్లికాలకు రూ.9 లక్షలు హెచ్చించారన్నారు. ఈ సదస్సు పేరుతో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు బాధ్యత వహించి చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా చిరంజీవిపై శుక్రవారం ఓయు జెఏసి సిబిఐకి ఫిర్యాదు చేసింది.

English summary
Osmania University University students sieged Central Toursim Minister Chiranjeevi's residence on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X