హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో బుకీ అరెస్ట్: బెట్టింగ్‌కు బ్యాట్స్‌మెన్ వద్దు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: క్రికెట్ బుకీ మహ్మద్ ఎయ్యాను శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముంబై నుండి వచ్చిన బుకీ మహ్మద్ హైదరాబాదు మీదుగా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ అర్ధరాత్రి హైదరాబాదు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇండిగా విమానం నుండి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

కృష్ణా జిల్లా విజయవాడలో ఈ నెల 19వ తేదిన కొత్త రాజీవ్ నగర్‌కు చెందిన షేక్ నన్నె మృతిని పోలీసులు హత్యగా నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫిక్సింగ్‌కు బ్యాట్సుమెన్ నో!

మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఏం జరిగినా ఎక్కువ శాతం బౌలర్లే వెలుగులోకి వస్తుంటారు. వారితోనే బుకీలు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫిక్సింగ్ చేయడానికి బ్యాట్సుమెన్ కన్నా బౌలర్లు సురక్షితం అనేది బుకీల భావన అనేది ఉందట. తమకు కావాల్సిన పరుగులు చేయాలన్నా.. సరైన సమయంలో ఫిక్సింగ్‌కు పాల్పడాలన్నా బ్యాట్సుమెన్‌కు సాధ్యం కాని విషయమంట.

ఒక్కోసారి ఫుల్ టాస్ బంతి పడినా దాన్ని బ్యాట్సుమెన్ సద్వినియోగం చేసుకోకపోవచ్చు. ఫ్రీ హిట్‌కు ఒక్క పరుగు చేయని పరిస్థితి ఉంటుంది. అదే బౌలర్ అయితే తమకు కావాల్సిన ఓవర్లో కావాల్సిన సమయంలో కచ్చితంగా బంతులేసే అవకాశం ఉంటుందని అంటున్నరు.

English summary

 The crime branch arrested a bookie on Friday for taking bets during the ongoing T-20 cricket matches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X