వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూరంగా సిబ్బంది: సంజయ్ దత్‌కు హ్యాండ్ ఇస్తే అంతే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
పుణే: 1993 బాంబు పేలుళ్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌తో జైలు సిబ్బంది ఎవరైనా కరచాలనం చేస్తే వారికి ఎసరు తప్పదా? అంటే అవుననే చెప్పవచ్చు. గతంలో రెండుసార్లు సంజయ్ దత్ ఈ జైలులో గడిపారు. ఆయన 2007లో ఈ జైలులో పదిహేను నెలల పాటు ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది జైలు సిబ్బంది అతనితో ఉత్సాహం కొద్ది కరచాలనం చేశారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు.

ఈ కారణంతో ఈసారి అక్కడి సిబ్బంది జాగ్రత్తగా ఉంటోంది. సంజయ్ దత్ అంటే ఎంతో అభిమానం ఉన్నప్పటికి ఎరవాడ జైలు సిబ్బంది మాత్రం ఆయనకు కాస్త దూరంగానే ఉంటున్నారట. ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం ఉన్నప్పటికీ గత అనుభవం దృష్టా ఆ ఆలోచన చేయడం లేదట. సంజయ్ దత్ ప్రస్తుతం మూడో నెంబరు బ్యారక్‌లో ఉన్నాడు. అతనికి ఖైదీ నెంబర్ 16656ను కేటాయించారు. గతంలో సంజయ్‌కు 15017ను కేటాయించారు.

ఇదీ దినచర్య

జైలులో ఉన్న సంజయ్ దత్ ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తారు. ఏడు గంటలకు ప్రార్థన, 11.30 గంటలకు లంచ్, సాయంత్రం నాలుగు గంటల వరకు పనులు, సాయంత్రం ఆరున్నర గంటలకు భోజనం. ఆ తర్వాత మళ్లీ బ్యారక్‌కు వెళ్లారు. గతంలో సంజయ్ దత్ వడ్రంగి పని అప్పగించగా.. ఈసారి ఏం అప్పగిస్తారోనని ఉత్సుకత చాలామందిలో ఉంది.

కాగా సంజయ్ దత్‌ను ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి మంగళవారం రాత్రి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్ వారం రోజుల క్రితం లొంగిపోయాడు. పూణేలోని యెరవాడ జైలులో సంజయ్ దత్ గతంలో రెండుసార్లు ఉన్నాడు. అయితే, గతంలో అతను విచారణ ఖైదీగా ఈ జైలులో గడిపాడు. ఈ దోషిగా జైలు జీవితం గడపాల్సి ఉంది.

English summary

 The Maharashtra government has taken actions aginst police officers who ingnored the rules of conduct by shaking hands and hugging actor Sanjay Dutt at the gates of Yerawada Central Prison in Pune, whene he was releasedon August 23, 2007.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X