వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలుకు ఎసరు: పెద్దలకు అలుళ్ల బెడద

By Pratap
|
Google Oneindia TeluguNews

Sons- in-law trouble for biggies
న్యూఢిల్లీ: అల్లుళ్ల వ్యవహారాలు పెద్దలకు శాపంగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో అల్లుళ్ల వ్యవహారాలు ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సల్ అల్లుడి కారణంగానే పదవి కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా అల్లుడు రాబర్ట్ వద్రా వ్యవహారం తలనొప్పిగా మారింది. తాజాగా, ఇండియా సిమెంట్స్ ఎండి, బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్‌కు అల్లుడు గురునాథ్ మయప్పన్ కారణంగా చిక్కులు వచ్చిపడ్డాయి.

రాబర్ట్ వద్రా అత్త సోనియా గాంధీ పలుకుపడిని అడ్డం పెట్టుకుని కొద్దికాలంలోనే కోట్లకు పడగలెత్తారని, అక్రమ పద్దతుల్లో ప్రయోజానాలు పొందరాని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆ మధ్య ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, చివరకు అతను వివాదం నుంచి బయటపడ్డాడు.

మేనల్లుడు లంచాలు తీసుకోవడంతో పవన్ కుమార్ బన్సల్ మంత్రి పదవిని కోల్పోయారు. రైల్వే బోర్డు పదవిని రూ. 10 కోట్లకు బేరం పెట్టి ముందస్తుగా 90 లక్షల రూపాయలు తీసుకుంటా బన్సల్ మేనల్లుడు సింగ్లా సిబిఐకి చిక్కాడు. దీంతో రైల్వే మంత్రిగా కొనసాగుతున్న బన్సల్ తప్పుకోవాల్సి వచ్చింది. పంజాబ్‌కు చెందిన సింగ్లా తన మేనమామతో పాటు ఎదుగుతూ వచ్చాడు. చివరకు మామ పదవికి ఎసరు పెట్టాడు.

తాజాగా, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరో అల్లుడి ఉదంతం తెరపైకి వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మయప్పన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. శ్రీనివాసన్ బిసిసిఐ పదవికి రాజీనామా చేయాలని ఐపియల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ లాంటివాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

గురునాథ్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆయన మామ శ్రీనివాసన్‌తో పాటు కొడైకెనాల్‌లో ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి పోలీసుల ముందు హాజరు కావడానికి ముంబై బయలుదేరారు. గురునాథ్‌కు పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

English summary

 sons-in-law affairs are creating troubles to big personalities. Sonia Gandhi with Robert vadra faced problem from Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X