వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధురైలో మీడియాను బోల్తా కొట్టించిన గురునాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gurunath
ముంబై: క్రికెట్ బెట్టింగ్ వివాదంలో చిక్కుకున్న బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ పోలీసుల ముందు హాజరు కావడానికి ముంబై చేరుకున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోగా పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉండగా మధురై నుంచి సాయంత్రం గం.5.25 నిమిషాలకు ప్రైవేట్ విమానంలో బయలుదేరారు. ఆయన గత మూడు రోజులుగా తన మామ శ్రీనివాసన్‌తో కలిసి కొడైకెనాల్‌లో అతిథి గృహంలో ఉన్నారు.

కొడై కెనాల్ నుంచి ఆయన మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బయలుదేరారు. గురునాథ్ కోసం మీడియా ప్రతినిధులు లాంజ్‌కు వెళ్లే ప్రవేశద్వారం పెద్ద యెత్తున మధ్యాహ్నం రెండు గంటల నుంచే నిరీక్షించారు. గురునాథ్ ఎప్పుడైనా రావచ్చునని వారు ఉత్కంఠతో ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే, వారికి కనిపించకుండా గురునాథ్ లోనికి వెళ్లిపోయారు.

గురునాథ్ కారులో వస్తాడని భావించి మీడియా ప్రతినిధులు ప్రతి కారును చూస్తూ ఉండిపోయారు. నీలం రంగు డెనిమ్స్, దళసరి నీలం రంగు చొక్కా ధరించిన ఆయన తన కారు నుంచి చాలా దూరంగా దిగి, ఎంట్రీ పాయింట్‌కు నడిచి వచ్చారు. లాంజ్‌లోకి ప్రవేశించే సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను గుర్తించారు.

అయితే, గురునాథ్‌ను ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి మాత్రం పట్టుకోగలిగారు. తన విషయంలో ఏ విధమైన వివాదం లేదని ఆయన ఆ ప్రతినిధితో అన్నారు. ప్రశ్నలు వేయడానికి ఆ ప్రతినిధి సిద్ధపడగా గబగబా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట ఇద్దరు వ్యక్తులున్నారు.

English summary
Gurunath Meiyappan was in Kodaikanal for the past three days in a guest house at Coakers' Walk along with his father-in-law. He had left the hill station around 1.30 pm in a car and arrived at Madurai airport around 5.5 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X