వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాసన్ రిజైన్ చేస్తారా, జట్టుకోసం రూల్స్ మార్చారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

N Srinivasan
చెన్నై: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిఈవో అరెస్టైన పక్షంలో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. శుక్రవారం వరకు కొడైకెనాల్‌‍లో తన మామ శ్రీనివాసన్‌తో ఉన్న గురునాథ్ మధ్యాహ్నం ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరినట్లుగా సమాచారం. ఆయనను పోలీసులు అరెస్టు చేస్తే శ్రీనివాసన్ పదవికి ముప్పు తప్పదంటున్నారు.

అదే సమయంలో గురునాథ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాసన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. చెన్నై జట్టుతో తన అల్లుడికి ఎలాంటి అధికారిక సంబంధం లేదని తేల్చినట్లుగా సమాచారం. అదే సమయంలో తన అల్లుడికి క్లీన్ చీట్ ఇచ్చారట. బోర్డులో శ్రీనివాసన్‌కు మెజార్టీ సభ్యుల మద్దతు ఉంది. శ్రీనివాసన్ ఇప్పటికే రెండు పోస్టుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జట్టు ఓనర్, బిసిసిఐ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు.

2008లో బిసిసిఐ కోశాధికారిగా ఉన్నప్పటి నుండే శ్రీనివాసన్ పైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన అల్లుడు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో శ్రీనివాసన్ పైన కూడా అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు. శ్రీనివాసన్ కోశాధికారిగా ఉన్న సమయంలో బిసిసిఐ రూల్స్‌ను కూడా మార్చివేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఐపిఎల్ ఫ్రాంచైజీసి దక్కించుకునేందుకు ఆయన రూల్స్‌ను మార్చారట. బిసిసిఐ నియమాలలోని రూల్స్ మార్చిన తర్వాతనే అతను ఫ్రాంచైజీని కొన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ బిసిసిఐ అధ్యక్షుడు ముత్తయ్య.. శ్రీనివాసన్ ఫ్రాంచైజీ అధ్యక్షుడిగా ఉంటూ బిసిసిఐ అధ్యక్షుడిగా ఉండవద్దని చెప్పారు.

English summary
As the evidence begins to pile up against Chennai Super Kings CEO Gurunath Meiyappan in the IPL Spot Fixing case, BCCI President N Srinivasan's position is coming under the scanner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X