వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడదెబ్బ: బస్సులోనే మృతి, పిట్టల్లా రాలుతున్నారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Heat Wave
హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఎండతీవ్రతకు, వడదెబ్బకు రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపడుతున్నారు. శనివారం ఎండదెబ్బకు మరింత మంది మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు బస్సులోనే మృతి చెందాడు. నందిపేట నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఓ ప్రయాణిస్తున్న ఓ యువకుడు వడదెబ్బకు మరణించాడు. యువకుడిని కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. మార్గమధ్యంలో వాంతులు చేసుకుంటుండడంతో తోటి ప్రయాణిలుకు 108కి సమాచరాం అందించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రాజు బస్సులోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు.

శనివారం మధ్యాహ్నానికే మృతుల సంఖ్య రాష్ట్రంలో 82కు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. గుంటూరులో 18 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, నల్లగొండ జిల్లాలో ఆరుగురు మరణించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురేసి మరణించారు.

నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నలుగురేసి, పశ్చిమ గోదావరి, మెదక్, మహబూబ్‌నగర్, కడప జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. శ్రీకాకుళం, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ఇద్దరేసి మృత్యువాత పడ్డారు. ఖమ్మం, అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఖమ్మం, అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతానికి మృతుల సంఖ్య 117కు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల పాట రాష్ట్రంలో వడగాలులు ఇలాగే వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. వడగాలుల ప్రభావం తెలంగామ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. భారతదేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

English summary
Heat wave is continuing in Andhra Pradesh. Due to heat wave and sun stroke about 117 persons dead on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X