వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ బెట్టింగ్: బిసిసిఐ చీఫ్ అల్లుడు గురునాథ్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gurunath Meiyappan
ముంబై: బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌ను ముంబై పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఐపియల్ బెట్టింగుకు సంబంధించి ఆయన పోలీసుల ముందు హాజరు కావడానికి శుక్రవారం రాత్రి ముంబై చేరుకున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను విచారించి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించామని, నేరంలో పాలు పంచుకున్నట్లు తమకు నిర్ధారణ అయిందని, దీంతో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

పోలీసుల కస్టడిలో ఉన్న విందూ దారాసింగ్‌ను శుక్రవారం నాడు సైతం విచారించిన పోలీసులు అతని నుంచి మరిన్ని కీలక వివరాలు సేకరించారు. ఒక్క గురునాథ్‌తోనే కాకుండా రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, ముంబై ఇండియన్స్‌ స్పిన్‌ బౌలర్‌ హర్భజన్‌సింగ్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టులో ఒకడైన గోనీలతో సైతం తనకు పరిచాలున్నాయని విందూ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన దారాసింగ్‌కు శుక్రవారం నాటికి పోలీసు కస్టడీ ముగియడంతో విచారణానంతరం ఢిల్లీ కోర్టుకు తరలించిన పోలీసులు మరింత కాలం అతనిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్డును కోరారు. వారి అభ్యర్ధనకు ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు విందూ దారాసింగ్‌తో పాటు మరో ఇద్దరు బుకీలకు ఈ నెల 28 వరకు పోలీసు కస్టడీ పొడిగించింది.

అదే విధంగా ఇప్పటికే అరెస్టు అయిన ఇద్దరు క్రికెటర్లతో పాటు మరో ఐదుగురికి జూన్‌ 4 వరకు రిమాండ్‌ను విధించింది. అందులో నుంచి ఇద్దరు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్ధను కోర్టు తిరస్కరించింది.

English summary
BCCI President N Srinivasan's son-in-law Gurunath Meiyappan was arrested by Mumbai police late on Friday night. Gurunath, who landed in Mumbai in Friday to face police in connection with IPL betting, was questioned by the Mumbai Crime Branch and close to midnight he was placed under arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X