వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్దతు నాకే: బెట్టు వీడని శ్రీనివాసన్, చెన్నైపై వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srinivasan
కోల్‌కతా: తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఆదివారం మరోసారి చెప్పారు. ఆయన కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిక్సింగ్ వ్యవహారంలో గురునాథ్ మియప్పన్ పైన విచారణ కొనసాగుతుందన్నారు. క్రికెట్ వ్యవహారాల నుంచి ఆయనను తప్పించామని, క్రమశిక్షణలో భాగంగానే గురునాథ్‌ను తప్పించినట్లు చెప్పారు. ఫిక్సింగ్ వ్యవహారంలో దోషులు ఎవరైనా వదిలి పెట్టేది లేదన్నారు.

పోలీసుల విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానన్నారు. ఫిక్సింగ్ కేసులో ఇప్పటికే న్యాయపరమైన విచారణ ప్రారంభించామని, ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. తన పనిని తాను చేసుకుంటూ పోతానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన మాట్లాడుతూ.. చెన్నై పైన ఆరోపణలను ఎవరు విశ్వసించరని అన్నారు.

తన రాజీనామాను బిసిసిఐ సభ్యులు ఎవరు కోరలేదన్నారు. ఫిక్సింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధ్యక్షుడి హోదాలో తాను ఎలాంటి రూల్స్‌ను అధిగమించలేదన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు తనను ఎంతో బాధించాయన్నారు. తన పనిని తాను నిర్వర్తించుకుంటూ పోతానని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

గురునాథ్ వ్యవహారంపై దర్యాఫ్తు కమిటీని వేశామని ఆయన చెప్పారు. అతనిపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గురునాథ్ సంప్రదింపులు జరుపకుండా ఆంక్షలు విధించామన్నారు. బిసిసిఐలో తనకు పూర్తి మద్దతు ఉందని శ్రీనివాసన్ చెప్పారు.

English summary
Board of Control for Cricket in India (BCCI) chief N 
 
 Srinivasan finally came out in public, amid IPL 
 
 spot-fixing scandal on Sunday, saying that the last 
 
 few days have been difficult for the BCCI and for 
 
 him as the president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X