వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత ద్వేషమెందుకు: బాబుకి శ్రీకాంత్, యాష్కీపై తెరాస

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu and Madhuyaski
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఇదే చివరి మహానాడు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి సోమవారం అన్నారు. రాష్ట్ర చరిత్రలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక ప్రతిపక్ష పార్టీ టిడిపి మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుపొందటం కల్ల అన్నారు. సొంత డబ్బాకే మహానాడు అన్నారు. జగన్ పైన బాబుకు ఎందుకు అంత ద్వేషమని ప్రశ్నించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సరైన ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని, ఇది అక్రమం అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కాంగ్రెసు పార్టీ కనుసన్నుల్లో నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు త్వరలో ఆ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

మధుయాష్కీ అక్కసు: టిఆర్ఎస్ శ్రవణ్

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ఆ పార్టీని వీడుతున్నారన్న అక్కసుతోనే తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత శ్రవణ్ మండిపడ్డారు.

చేతనైతే వారిని ఆపేందుకు ప్రయత్నించాలని, ఉద్యమ నేత పైన నిందలేసే ప్రయత్నాలు చేస్తే తెలంగాణవాదులు సహించరన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ముందు పెదవి విప్పలేని యాష్కీ తెరాసను ఉద్యమం చేయాలనడం హాస్యాస్పదమన్నారు. కెవిపికి కెసిఆర్‌కు సంబంధాలు అంటగడుతున్న యాష్కీ దమ్ముంటే ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో కెవిపి చేపట్టిన విల్లాల నిర్మాణాన్ని ఆపించాలని సవాల్ విసిరారు.

కెసిఆర్‌దో ఓట్లు నోట్లు సీట్లు దందా అంటూ విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మాటలను పల్లె వేస్తున్న యాష్కీ సమైక్యవాదుల మౌత్ పీస్‌గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజాయితీ ఉంటే తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని సూచించారు.

English summary
YSR Congress Party MLA Srikanth Reddy lashed out at TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X