వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం నిర్ణయమే: రాజీనామాపై కన్నా, బాబుపై కిరణ్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanna Lakshminarayana
అనంతపురం/చిత్తూరు: 26 జివోల విషయంలో తమ ప్రమేయం ఏమాత్రం లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అనంతపురం జిల్లాలో సోమవారం అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రుల రాజీనామా వ్యవహారం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. మంత్రుల రాజీనామాను పెద్దలు చూసుకుంటారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఘటన ప్రజాస్వామ్యానికే విఘాతమన్నారు.

బంగారు తల్లికి చట్ట రూపం: కిరణ

తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బంగారు తల్లి పథకానికి చట్ట రూపం తెస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో అన్నారు. ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తారు. పీలేరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బిసిల కోసం బడ్జెట్‌లో రూ.4027 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక చట్టం తీసుకు వచ్చామన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాపాలు కడుక్కునేందుకే పాదయాత్ర చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. చిత్తూరు డైరీని మూయించి హెరిటేజ్ స్థాపించుకున్నారన్నారు. బాబు హయాంలో బిసిలకు రూ.458 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం మాత్రం రూ.4027 కేటాయించిందన్నారు.

మావోల ఘాతుకంపై పురంధేశ్వరి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్సించుకునేందుకు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులు తిరుపతి వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ ఘటనను ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావులేదన్నారు.

అవిశ్వాసం పెడితే మద్దతు: ఇంద్రసేనా

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినా భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని నల్లు ఇంద్రాసేనా రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. అవినీతి మంత్రులను తొలగించిన ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. మిగతా కళంకిత మంత్రులను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు.

English summary
Minster Kanna Lakshminarayana refuted the Telugudesam party president Nara Chandrababu Naidu for making allegations against him in the YSR Congress YS Jagan's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X