వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాయం: మీడియాను ఆడిపోసుకున్న శ్రీనివాసన్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Srinivasan
చెన్నై: తన రాజీనామా డిమాండ్‌పై బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ మీడియాను ఆడిపోసుకున్నారు. మీడియా తనను గాయపరుస్తోందని, రాజీనామా చేయాలని మీడియా మాత్రమే అడుగుతోందని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి ఐపియల్ విజేతకు ట్రోఫీ ప్రదానం చేసిన తర్వాత ఆయన సోమవారం చెన్నై తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పానని, తాను రాజీనామా చేయడానికి తగిన కారణమేదీ లేదని ఆయన అన్నారు. విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని అడిగారు.

తాను రాజీనామా చేయబోనని శ్రీనివాసన్ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. తాను ఏ విధమైన తప్పు చేయలేదని, బిసిసిఐలో తనపై తిరుగుబాటు తలెత్తబోదని ఆయన అన్నారు. తనకు పూర్తి మద్దతు ఉందని, బిసిసిఐలో ఒక్కరు కూడా తన రాజీనామాను డిమాండ్ చేయలేదని ఆయన చెప్పారు.

విచారణలో తన ప్రమేయం ఏ మాత్రం ఉండదని ఆయన చెప్పారు. భయంతో గానీ పక్షపాతంతో గానీ వ్యవహరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తప్పులు ఉన్నట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాసన్ చెప్పారు.

English summary
A defiant and combative BCCI President, who has decided to hang on to his position despite the IPL spot-fixing scandal, Monday said his resignation is being sought only by a "hounding media".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X