వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు అవమానించారు, జగన్‌కు తీహార్ రెడీ: నామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Nama Nageswar Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం ద్వారా ఓటర్లను కేంద్ర మంత్రి చిరంజీవి అవమానించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నామా నాగేశ్వర రావు విమర్శించారు. పార్టీ మహానాడులో ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి పదవి రాలేదనే అక్కసుతోనే వైయస్ జగన్ పార్టీ పెట్టారని ఆయన అన్నారు. సామాజిక న్యాయం అంటూ వచ్చిన పార్టీ పుట్టుకతోనే కనుమరుగైందని ఆయన అన్నారు. జగన్ కోసం తీహార్ జైలు తెరిచే ఉన్నాయని నామా అన్నారు.

దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలు ఉండడం వల్లనే నల్లధనం జాబితా బయటపెట్టడం లేదని అన్నారు. నల్లధనంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటును స్తంభింపజేశామని చెప్పుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్ల రూపాయలకు మించి ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టాలనే దుర్పుద్ధితోనే పెట్టిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసు అని అన్నారు. ప్రజాధనాన్ని కాజేసి పార్టీ పెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చంద్రబాబుపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీకి తెలంగాణపై స్పష్టత ఉందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంంగా 2008లో చేసిన తీర్మానాన్ని తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. అఖిలపక్ష సమావేశం తెలంగాణపై పెట్టాలని తామే డిమాండ్ చేశామని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రాకవసరమని అన్నారు.

కేంద్రంలో సంకీర్ణానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. 2014లో అన్ని శక్తులను కూడదీసి శక్తి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే ఉందని చెప్పారు. కేంద్రంలో బిజెపి, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని అన్నారు.

English summary

 Proposing political resolution at Mahanadu, the telugudesam party MP Nama Nageswar Rao said that union minister Chiranjeevi has insulted voters merging Prajarajyam party in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X