వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కర్లేదు: జూనియర్ ఎన్టీఆర్‌కు తారకరత్న కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Tarakaratna
హైదరాబాద్: మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదనే హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో మరో నందమూరి హీరో తారకరత్న విభేదించారు. మహానాడుకు రావడానికి ఆహ్వానం అవసరం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం తాత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ అని, తమ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని, ప్రత్యేకంగా ఆహ్వానం అందాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.

కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. అందరం కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి పనిచేయడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. మహానాడును పండుగలా జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణ అన్నీ చూసుకుంటారని ఆయన అన్నారు. పెద్ద దిక్కుగా వారిద్దరున్నారని, వారు ఏం చేయాలంటే తాము అది చేస్తామని తారకరత్న అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, అవసరమైతే పోటీ చేస్తానని ఆయన అన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు తాము ఏం చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తమ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ఆయన అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందని తారకరత్న అన్నారు.

ఇదిలావుంటే, స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ గుర్తుతో నిర్వహించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలపై మహానాడులో ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన మంగళవారం ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని ఆయన అన్నారు. తమది నిజాయితీ గల పార్టీ అని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. దోపిడీ దొంగల పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడం బాధగా ఉందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల తీరుపై వ్యాఖ్యానించారు.

English summary

 
 Nandamuri hero Tarakaratna has differed with Tollywood hero Jr NTR statement made regarding invitation to the Telugudesam party Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X