వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విందూ బుట్టలో పడని భజ్జీ!, హోటల్ ఓనరే మధ్యవర్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harbhajan Singh - Manpreet Gony
ముంబై: ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్‌ను కూడా విందూ దారా సింగ్ ముగ్గులోకి లాగబోయాడా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, భజ్జీ మాత్రం అతనికి అనుకూలంగా వ్యవహరించలేదట. ఇటీవల స్పాట్ ఫిక్సింగ్ కేసులో బాలీవుడ్ నటుడు విందూను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో భజ్జీ, మన్‌ప్రీత్ గోనీలకు కూడా విందూ గాలం వేసినట్లుగా తేలిందట.

విందూ హర్భజన్‌తో ఈ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ చేయించే ఉద్దేశ్యంతో అతనికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ భజ్జీ మాత్రం అతనికి లొంగలేదు. ఐతే వచ్చే సీజన్లో మాత్రం భజ్జీని కచ్చితంగా ముగ్గులోకి దించాలని నిర్ణయించుకున్నాడట విందూ. భజ్జీతో పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్ గోనీని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడట. వారు మాత్రం అతనికి ఆకర్షితులు కాలేదట.

కాగా, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టైన విందూ, గురునాథ్‌లకు మధ్యవర్తిగా పని చేసిన ఓ హోటల్ యజమానికి సమన్లు పంపించినట్లు ముంబై క్రైం బ్రాంచ్ తెలిపింది. ఆయన పేరు విగ్రమ్ అని, చెన్నైలో హోటల్ నడుపుతున్నారని చెప్పారు. ఈ హోటల్ కేంద్రంగా చెన్నైలో బెట్టింగ్ కార్యకలాపాలు జరిగాయని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేశామన్నారు.

మెరీనాబీచ్‌లో గురునాథ్ విహార నౌక నుంచి ఓ సెల్ ఫోన్, ఆయన నివాసం నుంచి రెండు సెల్ ఫోన్లు, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల వివరాలు, ఇతర టీముల వివరాల అగర్వాల్‌కు అందేవని, వీటి ఆధారంగానే ఆయన బెట్టింగులు నిర్వహించేవారన్నారు.

English summary

 It is said that Mumbai Indians player Harbhajan Singh and Kings XI Punjab player Monpreet Gony refused Vindoo Dara Singh's offers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X