వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుట్టు విప్పుతున్న గురు డైరీ: శ్రీనివాసన్ బుకాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

urunath Meiyappan
చెన్నై/న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో తన అల్లుడు గురునాథ్ మేయప్పన్‌కు ఏ విధమైన సంబంధం లేదని బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్ చెబుతున్నారు. అయితే ఆ జట్టుతో గురునాథ్‌కు గల సంబంధాలపై ఆధారాలు బయట పడుతున్నాయి. గురునాథ్ ఇంట్లో ఆటగాళ్ల పేర్లతో ఉన్న డైరీ ఒకటి లభించింది. అతడి మోటార్‌బోట్‌లో ఫోన్ దొరికింది. కీలక ఆధారాలు లభించడంతో ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న మరెంత మంది బయటకి వస్తారో అని ఉత్కంఠ నెలకొంది.

ఇదిలావుంటే 20 ఏళ్ల కిందటే తనను డబ్బుతో కొనజూశారని మాజీ అంపైర్ హోల్డర్ మరో బాంబు పేల్చాడు. మరోవైపు పేసర్ శ్రీశాంత్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ఫిక్సింగ్ గొడవలో తాము తలదూర్చబోమని చెప్పిన కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ అదంతా బీసీసీఐ ఇంటి గొడవే అన్నట్లు తేల్చేశారు.

గురునాథ్ డైరీలో ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న 10-12 మందికిపైగా చెన్నై, ఇత ర ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్ల పేర్లున్నాయని సమాచారం. మరో పక్క చెన్నై మెరీనా బీచ్‌లో లంగరేసి ఉన్న గురునాథ్‌కు చెందిన విలాసవంతమైన మోటార్ బోట్‌లో ఒక సెల్‌ఫోన్‌ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బోట్‌లో గురునాథ్ పార్టీలు చేసుకునేవాడట. దానిలోనే చెన్నై కెప్టెన్ ధోనీ భార్య సాక్షితో కలిసి విహారం చేసేవాడట. ఇప్పుడు ఆ బోట్‌లో దొరికిన ఫోన్‌తో గురునాథ్ బెట్టింగ్ కోసం ఉపయోగించిన ఫోన్లన్నీ పోలీసులకు చిక్కినట్టయింది. ఇప్పుడిక ఈ డైరీ, ఫోన్‌లతో కీలక ఆధారాలు దొరక వచ్చని భావిస్తున్నారు. ఇక 2011 డిసెంబర్‌లో గురునాథ్‌ను చెన్నై యజమానిగా పేర్కొం టూ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఫ్రాంచైజీ యజమానులకు పంపిన ఈ-మెయిల్ బయటపడింది.

చెన్నై జట్టు ప్రిన్సిపాల్ అని గురునాథ్ పేరుతో ఉన్న విజిటింగ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సోదాల్లో జట్టుకు గురునాథ్‌కు ఉన్న సంబంధాలకు సంబంధించి మరిన్ని కీలక పత్రాలు లభ్యమయ్యాయి. వీటిల్లో చెన్నై జట్టు పేరుతో ఉన్న 365 కవర్లు, 190 విజిటింగ్ కార్డులు, 1400 స్టిక్కర్లు, 2010 వేలం జాబితాతో పాటు జట్టు లోగోతో ఉన్న టి-షర్టులు లభించాయి. 2009లో జట్టుకు వర్క్‌షాప్ నిర్వహించినపుడు యజమాని హోదాలో గురునాథ్ ప్రసంగ వీడియో కూడా పోలీసులు చిక్కింది. గురునాథ్‌కు క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నించిన శ్రీనివాసన్ వ్యూహం పోలీసుల సోదాలతో బెడిసికొట్టింది.

చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్ యాజమానితో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని విందూ దారాసింగ్, గురు పోలీసులకు వెల్లడించారట. ఇంత పక్కాగా ఆధారాలు ఉన్నా చెన్నైపై నిషేధం కత్తి వేలాడుతున్నందున శ్రీనివాసన్‌కు అబద్ధం చెప్పడం తప్ప గత్యంతరం లేకపోయింది. మరోవైపు విందూతో సాగించిన ఫోన్ సంభాషణను గుర్తించేందుకు పోలీసులు గురు స్వరాన్ని రికార్డు చేశారు.

వన్డే మ్యాచ్‌ను ఫిక్స్ చేయమన్నారు: హోల్డర్

20 ఏళ్ల కిందటే బుకీలు తనతో ఫిక్సింగ్ చేయచూశారని ఇంగ్లండ్‌కు చెందిన మాజీ అంపైర్ జాన్ హోల్డర్ చెప్పాడు. 1993 లో యూఏఈలో శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్‌లోని ఓ వన్డేలో బుకీలు తనను సంప్రదించారని హోల్డర్ వెల్లడించాడు. లంక బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే రూ. 4.5 లక్షల ఇవ్వజూపారని హోల్డర్ తెలిపాడు. అయితే దాన్ని తాను తిరస్కరించానని హోల్డర్ చెప్పాడు.

English summary
Mumbai police have seized Gurunath Meiyappan' dairy in which evidence for linking him to the Chennai Super Kings are revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X